జీహెచ్ఎంసీ కార్పొరేటకర్లతో ప్రధాని మోదీ భేటి అయ్యారు... ప్రతి కార్పొరేటర్ తో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బాగా పనిచేయాలని మోదీ అన్నట్టు కార్పొరేటర్లు వల్లడించారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో కలిశారు. గంటన్నర పాటు సమావేశం జరిగింది. సమాజసేవతో పాటు అట్టడుగు వర్గాలకు సహయసహకారాలు అందించాలని మోదీ సూచించారు. తెలంగాణలో సుపరిపాలన రావడానికి కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు భాజపా పోరాటం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు..